: నావికా దళంలోకి ఐసీజీఎస్ రాజ్ వీర్ నిఘా నౌక


భారత త్రివిధ దళాల్లో నౌకాదళానిది ప్రత్యేక స్థానం. భూతలం, గగన తలం నుంచి యుద్ధానికి సిద్దం కావడం ఓ ఎత్తైతే నడి సంద్రంలో విజయబావుటా ఎగురవేయడం భారత నౌకాదళానికి నిత్య కృత్యం. అందుకే సముద్ర దొంగలు హిందూ మహా సముద్ర జలాల్లో చొరబడలేక తోక ముడుస్తున్నారు. పటిష్ఠమైన భారత నావికాదళం అమ్ములపొదిలోనికి ఐసీజీఎన్ రాజ్ వీర్ గస్తీ నౌక వచ్చి చేరింది. దీంతో భారత నౌకాదళం శత్రుదుర్భేధ్యంగా మారనుంది. విశాఖతీరంలో ఈ నౌకను కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఆర్కే మాథుర్ ప్రారంభించారు. 2018 నాటికి మరో 150 నౌకలను తీర రక్షక దళంలోకి అందుబాటులోకి తీసుకురానున్నామని ఆయన తెలిపారు. భారత తీర రేఖ పొడవునా 41 తీర రక్షక దళ స్టేషన్లు నెలకొల్పనున్నట్టు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News