: మోడీ వల్ల మతవిద్వేషాలు రేగే అవకాశముంది: కంచె ఐలయ్య
రేపు హైదరాబాదులో బీజేపీ నిర్వహించే నరేంద్ర మోడీ సభ వల్ల మత విద్వేషాలు చెలరేగే అవకాశముందని ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ ఆచార్యుడు కంచె ఐలయ్య అన్నారు. గుజరాత్ లో ముస్లిం మైనారిటీల జీవితాలను ఛిద్రం చేసిన మోడీ, 'నవభారత యువభేరి' సభలో ప్రజలకు ఏమని సందేశమిస్తారని ప్రశ్నించారు. మతోన్మాది మోడీ దేశానికి ప్రధాని అయితే పొరుగు దేశాల దాడులతో పాటు, దేశంలో మత విద్వేషాలు చెలరేగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.