: తెలంగాణ ఎడారవుతుంటే కేసీఆర్ ఏం చేశారు?: ఎర్రబెల్లి


తెలంగాణ ఎడారవుతుంటే కేసీఆర్ ఏం చేశారని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. బాబ్లీ కోసం ప్రజలు, నేతలు పోరాటాలు చేస్తే రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఎంపీగా కేసీఆర్ ఏం చేశారని, ఇప్పుడు తెలంగాణకు అది చేస్తా ఇది చేస్తా అంటూ ఆకాశంలో మేడలు కడుతున్నాడని కేసీఆర్ పై మండిపడ్డారు. టీడీపీ డిమాండ్ చేయడం వల్లే అఖిలపక్షం వేశారని గుర్తు చేశారు. ఇంతకుముందు చెప్పినట్టే, అఖిలపక్షంలో తెలంగాణకు కట్టుబడి ఉన్నట్టు టీడీపీ స్పష్టం చేసిందని ఎర్రబెల్లి అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు తెలంగాణకు అనుకూలంగా ఉన్న టీడీపీపై విమర్శలు చేయడమేంటని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News