: సింధు ఓటమి.. అయినా చరిత్రే


పుసర్ల వెంకటసింధు.. ఇప్పుడీ తెలుగమ్మాయి భారత క్రీడారంగంలో హాట్ టాపిక్. ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో సెమీస్ చేరిన సింధు అందరి కళ్ళను తనవైపుకు తిప్పుకుంది. చైనాలోని గ్వాంగ్జౌ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఈవెంట్లో సింధు సెమీస్ లో ఓడినా చరిత్ర సృష్టించింది. ఈ పోరులో ఆమె 10-21, 13-21తో థాయ్ షట్లర్ రచనోక్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో, కాంస్యంతో సరిపెట్టుకుంది. అయితే, ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ మహిళల సింగిల్స్ లో పతకం సాధించి రికార్డుల్లోకెక్కింది. సింధు.. ఇంతకుముందోసారి కూడా రచనోక్ చేతిలో పరాజయం పాలవడం గమనార్హం.

  • Loading...

More Telugu News