: కిరణ్ కఠోరమైన నిజాలు వెల్లడించారు: ఎంపీ ఉండవల్లి


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కఠోరమైన నిజాలు వెల్లడించారని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా తన అభిప్రాయాలు చెప్పవచ్చనేది కాంగ్రెస్ పార్టీ విధానమని, ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని నిష్కర్షగా చెప్పారని అన్నారు. హైదరాబాద్ లో శాసన సభ్యులు విశాలాంధ్రను కోరుతున్నారని తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు విప్ లుండవని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై ఉండవల్లి నిప్పులు చెరిగారు. అతని వల్లే ఇరు ప్రాంతాల్లో విద్వేషాలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రను కేసీఆర్ వక్రీకరిస్తున్నారని, ఆయన చెప్పేవన్నీ అబద్దాలేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రిని కర్రీ పాయింట్ పెట్టుకోవాలని విమర్శిచడం కేసీఆర్ స్థాయిని సూచిస్తుందని అన్నారు. తెలంగాణ ఏర్పడితే జల పంపకాలకోసం పాకిస్తాన్ తో పోరాడుతున్నట్టు తాము పోరాడాలని అనడం అతని బుద్ధిని సూచిస్తుందని అన్నారు. హైదరాబాద్ నుంచి తాము పోతామని ఎప్పుడూ చెప్పలేదని ఉండవల్లి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News