: జపాన్ అప్పులు.. 1,000,000,000,000,000
జపాన్ దేశం జాతీయ అప్పులు క్వాడ్రిలియన్ యెన్ లకు చేరుకున్నాయి. అంటే 1,000,000,000,000,000 యెన్ లు. వివరంగా చెప్పాలంటే.. పది కోట్ల కోట్ల యెన్ లు. కరెన్సీ మారకంలో చూస్తే.. 10 యెన్ లు.. 6 రూపాయిల 32 పైసలతో సమానం. జపాన్ ఆర్థిక రంగ స్థాయికి ఆ దేశ అప్పులు రెండు రెట్ల కంటే ఎక్కువైపోయాయి. అదే అమెరికా అప్పులను యెన్ లలోకి మార్చి చూస్తే.. జపాన్ అప్పులకంటే యాభై శాతం అదనంగా ఉన్నాయి. 1.5 క్వాడ్రిలియన్ అనమాట.