: మరింత మంది ప్రముఖుల చుట్టూ విచారణ ఉచ్చు


'కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా ప్రముఖులతో జరిపిన సంభాషణల్లో 2జి కేసుకు సంబంధించిన అంశాలకే పరిమితమై మిగతావాటిని విస్మరించారు. ఈ సంభాషణల్లో దేశాంతర లావాదేవీలు సహా 2జీకి మించినవి ఎన్నో ఉన్నాయి. వాటిపై ఎందుకు విచారణ చేపట్టలేదు?'.. అంటూ సర్వోన్నత న్యాయస్థానం నాలుగు రోజుల కిందట సీబీఐని నిలదీసింది. దీంతో ప్రముఖులు విచారణను ఎదుర్కోవడమేగాక కోర్టు బోనెక్కే పరిస్థితి కనిపిస్తోంది.

టాటా స్టీల్ కు లైసెన్స్ జారీ చేయడానికి నాడు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మధుకోడా లంచం అడిగారు. టాటా మోటార్స్ కు కాంట్రాక్ట్ ఇప్పించడం కోసం ఆ కంపెనీ తరఫున నీరా రాడియా డీఎంకే నేతలను సంప్రదించారు. మాజీ టెలికాం రెగ్యులేటర్ గా పనిచేసిన ప్రదీప్ బైజాల్ రిటైరైన తర్వాత కీలక పోస్ట్ సంపాదించారు. ఇక, అనిల్ అంబానీకి చెందిన అడాగ్ రికార్డులలో అవకతవకలకు పాల్పడింది. నీరా రాడియా మంత్రులు, రాజకీయ నేతలు, కార్పొరేట్ అధిపతులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో జరిపిన 5,800 సంభాషణలలో ఇవి కొన్ని మాత్రమే.

ఈ సంభాషణలను గతంలో ఐటీ శాఖ రికార్డు చేయగా.. సీబీఐ 2జీ కేసుకు సంబంధించిన అంశాలపైనే దృష్టి పెట్టింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రతీ సంభాషణలోంచి నిందితులను బయటకు లాగి విచారణ జరపాల్సిన బాధ్యత సీబీఐ పై ఉంది. అదే జరిగితే మరెన్నో అవకతవకలు వెలుగు చూసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News