: విభజనపై కాంగ్రెస్ లోనే వ్యతిరేకత ఉంది: ఎంపీ అనంత
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోందని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రకటన ఇష్టంలేదు కాబట్టే ఇలాంటి విభేదాలు వస్తున్నాయన్నారు. అటు ప్రజల నాడి తెలుసుకోకపోవడంలో రాజకీయ పార్టీలు పూర్తిగా వైఫల్యం చెందాయని మండిపడ్డారు. ప్రజల ఉద్యమం వెనక నాయకులు, పార్టీలు ఉన్నారన్న ఆరోపణలను అనంత ఖండించారు. కాగా, రాజధాని హైదరాబాదు, జల వనరుల సమస్య, ఇతర సమస్యలను విభజనకు ముందే పరిష్కరించాలని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు.