: అధర సౌందర్యం అసలు గుట్టు చెబుతుందిట
అమ్మాయిలపై అరాచకాలు, అకృత్యాలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో వాటిని నివారించడం ఓ పెద్ద ప్రయాస అయిపోతోంది సరికదా.. కనీసం నేరాలు జరిగిన తర్వాత ఆచూకీ కనిపెట్టడం కూడా సాధ్యం కావడం లేదు! అలాంటి నేపథ్యంలో సరికొత్త నేర పరిశోధన మార్గాలను అన్వేషించడం అనేది అనివార్యం. ఈ ప్రయత్నాల్లో భాగంగానే.. అమ్మాయిల లిప్‌స్టిక్ మరకలను కూడా నేరపరిశోధనలో కీలకంగా ఎంచగల పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
గర్వించాల్సిన విషయం ఏంటంటే.. ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానానికి రామన్ స్పెక్ట్రోస్కోపీ అని పేరు పెట్టారు. మన భారతీయ దిగ్గజం సీవీరామన్ డెవలప్ చేసిన సిద్ధాంతాల ఆధారంగానే.. ఈ పద్ధతిని కనుక్కొన్నందున ఆయన పేరు పెట్టారుట. కాస్మెటిక్ ఎవిడెన్స్‌గా పిలిచే దీనిలో కేవలం లిప్‌స్టిక్ మరకలే కాదు.. అమ్మాయిలు వేసుకునే ఫౌండేషన్ ఐ లైనర్లు, క్రీముల అవశేషాలను కూడా విశ్లేషించగలరుట.
దీని ద్వారా నేరంలో నేరస్తుడికి బాధితురాలికి మధ్య ఏం జరిగిందో తెలుసుకోగలిగితే నేర పరిశోధన సులువు అవుతుందనేది అంచనా. టిష్యూపేపర్లు, గ్లాసులు, చెమ్చాలపై ఉండే లిప్‌స్టిక్, ఇతర కాస్మెటిక్ మరకల ద్వారా ఈ పరిశోధన సాగుతుందిట.