: నేనుండగా అసోంను విభజించే ప్రశ్నేలేదు: తరుణ్ గొగోయ్
అసోం రాష్ట్రాన్ని తాను విడదీయబోనని, అసలు విభజించే ప్రశ్నే తలెత్తదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ స్పష్టం చేశారు. తన నియోజకవర్గం టిటబోర్ లో జరగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అన్ని జాతుల వారూ కలసిమెలసి అస్సామీయుల్లా ఉండాలని ఆకాంక్షించారు. అంతా కలసి ఉన్నప్పుడు ఇతరులు తమను చూసి భయపడతారని, విడిపోతే వారే భయపెట్టడానికి చూస్తారని జీవిత సత్యం బోధించారు. బంద్ ల సంస్కృతి మానేసి పని సంస్కృతి అలవాటు చేసుకోవాలని సూచించారు.