: సైనికుల హత్య జరిగిన తరుణంలో నేను పాడలేను: పాక్ సింగర్
ఐదుగురు భారత జవాన్లను కాల్చిచంపడంపై పాకిస్థానీ గాయకురాలు సనమ్ మార్వి విచారం వ్యక్తం చేశారు. ఒక తల్లిగా మృతుల తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోగలనని అన్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీలో జరగాల్సిన తన ప్రదర్శనను రద్దు చేసుకుని స్వదేశానికి వెళ్లిన అనంతరం సనమ్ తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. సైనికుల హత్య జరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో తాను మనస్ఫూర్తిగా ఆలపించలేనన్నారు. కళకారులను రాజకీయాల్లోకి లాగవద్దని భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాలను ఆమె అభ్యర్థించారు.