: ఐఏఎస్ విధానాన్ని ఎత్తివేయాలి: అజంఖాన్
ఇసుక మాఫియా ఒత్తిడితో కలెక్టర్ దుర్గాశక్తి నాగ్ పాల్ ను సస్పెండ్ చేసి చిక్కుల్లో పడ్డ ఉత్తరప్రదేశ్ సర్కారు.. అసలు ఐఏఎస్ అధికారులు ఈ దేశానికి అక్కర్లేదని ప్రకటించేసింది. దుర్గాశక్తి సస్పెన్షన్ సాధారణ చర్యేనని సమాజ్ వాదీ పార్టీ నేత అజంఖాన్ సమర్థించుకున్నారు. దుర్గను మీడియా దుర్గామాతను చేసిందన్నారు. ఇలాంటి అధికారులు (ఐఏఎస్) దేశం మొత్తం మీద 1,000 లేదా 2,000 మంది మాత్రమే ఉంటారని, కానీ దేశ జనాభా 125 కోట్లని ఆయన చెప్పారు.
'ఇది బ్రిటన్ విధానం. ఐఏఎస్ విధానం వాళ్లు ప్రవేశపెట్టింది. చైనా, యూరోప్, అమెరికా, జపాన్, గల్ఫ్ దేశాల్లో ఎక్కడా ఈ విధానం లేదు. ఇప్పుడు బ్రిటన్ లోనూ లేదు. ఇన్ని కోట్ల మంది ప్రజలను 2,000 లేదా 3,000 లేదా 10,000 మంది పాలిస్తారా? దేశంలో ఉన్న మిగతా వాళ్లు చేతకానివారేం కాదు. వాళ్లు కూడా పాలించగలరు. ఐఏఎస్ విధానాన్ని ఎత్తివేయాలి' అని అజంఖాన్ డిమాండ్ చేశారు.