: సచిన్, పాంటింగ్ కంటే లారానే బెస్ట్: అఫ్రిది
బ్యాట్స్ మెన్ లో ఎవరు గొప్ప? అనే చర్చలో పాకిస్థానీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిదీ కూడా చేరిపోయాడు. టెండూల్కర్, పాంటింగ్ ఇద్దరూ గ్రేటేనన్నాడు. కానీ, వెస్టిండీస్ క్రికెటర్ లారా వారికంటే కొంచెం ఎక్కువని తాను భావిస్తున్నట్లుగా షాహిద్ అఫ్రిది చెప్పాడు. తన 16 ఏళ్ల కెరీర్లో చూసిన బెస్ట్ బ్యాట్స్ మన్ గా లారాను పేర్కొన్నాడు. లారా చాలా క్లిష్టమైన బ్యాట్స్ మన్ అని చెప్పాడు. ఎలాంటి బంతులనైనా బౌండరీలకు తరలిస్తాడని మెచ్చుకున్నాడు. అతడి బ్యాటింగ్ ను చూడడాన్ని ఎంజాయ్ చేస్తానన్నాడు. ఇక తన కెరీర్లో చూసిన అత్యుత్తమ బౌలర్ గా ఆస్ట్రేలియా వెటరన్ మెక్ గ్రాత్ ను పేర్కొన్నాడు.