: నిఘా సంస్థల సమాచారాన్ని బుట్ట దాఖలు చేశారు: దాడి
నిఘా సంస్థల నుంచి వచ్చిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అలక్ష్యం చేసిందని టీడీపీ నేత దాడి వీరభ్రదరావు వ్యాఖ్యానించారు. మక్కా మసీదు పేలుడు తర్వాత కొన్ని రోజులు మాత్రమే తనిఖీలు చేసి పోలీసులు చేతులు దులిపేసుకున్నారని ఆయన విమర్శించారు. ఇందుకు స్వచ్ఛందంగా ప్రభుత్వం నుంచి సీఎం, మంత్రులు వైదొలగాలని లేకపోతే తప్పించాలని డిమాండు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్టు ఏమీ ప్రకటించలేదనీ, చిన్నపాటి తనిఖీలు మాత్రమే చేశారనీ అన్నారు. నాగార్జున సాగర్, తిరుమలపై ఉగ్రవాదుల కన్నుపడిందని చెప్పిన దాడి, ప్రభుత్వం వీటిపై ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని ప్రశ్నించారు. కనీసం ఇంటెలిజెన్స్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం భూమి కూడా ఇవ్వడం లేదన్నారు. సత్ప్రవర్తనతో ఉన్నాడని శిక్షకు ముందే ప్రభుత్వం మక్బూల్ ను విడుదల చేసిందని గుర్తు చేశారు.