: కాంగ్రెస్ నేతల కన్నీళ్లు తుడవడానికే ఆంటోనీ కమిటీ: గాదె
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల కన్నీళ్లు తుడవడానికే అధిష్ఠానం ఆంటోనీ కమిటీ వేసిందని ఆ పార్టీ నేత గాదె వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వారే వేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలను ఎందుకు విస్మరించిందని ప్రశ్నించారు. అంతా అయిపోయినాక కాంగ్రెస్ నేతలపై ప్రజలు తిరగబడకుండా ఉండేందుకు కమిటీ వేశారని ఆయన అభిప్రాయపడ్డారు.