: క్వార్టర్స్ కు దూసుకెళ్ళిన సైనా
చైనాలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గ్వాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో ఈ ఉదయం జరిగిన ప్రీక్వార్టర్స్ పోరులో సైనా 21-18, 16-21, 21-14తో థాయ్ లాండ్ క్రీడాకారిణి పోర్నిటిప్ పై విజయం సాధించింది. మరో భారత క్రీడాకారిణి, తెలుగుతేజం పీవీ సింధు.. ప్రీక్వార్టర్స్ లో చైనా అమ్మాయి ఇహాన్ వాంగ్ తో తలపడనుంది. ఇహాన్ వాంగ్ ఈ టోర్నీలో రెండో సీడ్ కావడం గమనార్హం.