: రాహుల్ వివాహంపై ఏఐసీసీ సెక్రటరీ వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఏఐసీసీ సెక్రటరీ షైరాజ్ జీవన్ వాల్మికి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. వారసత్వ పాలన నిరోధించేందుకే రాహుల్ వివాహం చేసుకోనని శపథం చేశారని వాల్మీకి ముంబయిలో మీడియాతో అన్నారు. ఈ మాటలు కలకలం రేపడంతో వెంటనే స్పందించిన ఆయన.. ఒకవేళ తాను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు ముంబయి మీడియా సమావేశంలో తెలిపారు. ఆ విధంగా రాహుల్ అన్నట్టు తానూ ఎక్కడో విన్నానని వాల్మీకి వివరణ ఇచ్చారు. ఇక వెంటనే ప్లేటు మార్చి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీపై విమర్శలకు తెరదీశాడు. ఆ గడ్డం మనిషి (మోడీ) ఆధ్వర్యంలో గుజరాత్ ముందుకుపోదని మీడియా దృష్టి మరల్చే ప్రయత్నం చేశాడు.