: ఎర్రదీపాలతో ఎంతో మేలు


రాత్రిపూట తెల్లటి వెలుగులను వెదజల్లే దీపాలకన్నా కూడా ఎర్రటి వెలుగులను వెదజల్లే దీపాలే ఎంతో మేలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి ఎర్రటి వెలుగులనిచ్చే దీపాల వల్ల పలురకాలైన అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రాత్రిపూట విధులను నిర్వహించే వారికి తెల్లటి వెలుగులనిచ్చే దీపాలకన్నా కూడా ఎర్రటి వెలుగులనిచ్చే దీపాలు ఉంటే వారి ఆరోగ్యానికి ఎంతో మేలని తాజా అధ్యయనం చెబుతోంది. రాత్రి షిప్టుల్లో పనిచేసేవారు ఇలా ఎర్రటి దీపాల వెలుగులో పనిచేయడం వల్ల కొంతమేర అనారోగ్య సమస్యలు దూరంగా ఉంటాయని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. మనుషుల్లోని మనోభావాలు, ఆలోచనా ధోరణి ఆయా సందర్భాలలో వివిధ రంగుల దీపాల వెలుగులో ఎలా ఉంటాయనే విషయాన్ని పరిశోధకులు తమ పరిశోధనలో అధ్యయనం చేశారు.

ఈ అధ్యయనంలో నీలిరంగు దీపం ప్రభావం వ్యక్తుల్లో అత్యంత ప్రతికూలంగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. అలాగే తెల్లటి దీపం వెలుతురు కూడా అంతే తరహా ప్రభావాన్ని చూపినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాత్రి వేళల్లో వాడిన ఎరుపురంగు దీపకాంతి ప్రభావం వ్యక్తుల్లో సానుకూల ప్రభావాన్ని చూపినట్టు తమ పరిశోధనల్లో వెల్లడైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా కుంగుబాటు వంటి సమస్యలకు ఎర్రటి దీపం వెలుగు పరిష్కారంగా అనిపించిందని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ పరిశోధనకు వీరు ఎలుకలను పోలివుండే 'హాంస్టర్‌' అనే చిన్న జంతువులను ఎంపిక చేసుకున్నారు. ఇలాంటి జంతువులను కొన్ని దేశాల్లో పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. వీటిని రాత్రివేళల్లో వివిధ రంగుల దీపాల వెలుగుల్లో ఉంచి పరిశీలించారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాలు మనుషులకు కూడా వర్తిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News