: కేసీఆర్ ను చంపాలనుకుంటున్నది వారసులే: వీరశివారెడ్డి
కేసీఆర్ ను చంపాల్సిన అవసరం.. ఆస్తుల కోసం, రాజకీయ వారసత్వం కోసం వారి వారసులకే ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ను చంపాల్సిన అవసరం ఎవరికీ లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటించిన నేపథ్యంలో, భయపడ్డ టీఆర్ఎస్ నేతలు కొత్త ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
కేవలం పార్టీని కాపాడుకునేందుకే ఆ పార్టీ నేతలు కేసీఆర్ హత్యకు సుపారీ ఇచ్చినట్టు చెబుతున్నారని వీరశివారెడ్డి ఆక్షేపించారు. ఇప్పటికే ఆ పార్టీకి విజయశాంతి దూరం కాగా.. మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అదే బాటపట్టనున్నారని స్పష్టం చేశారు. సీమాంధ్ర మంత్రులకు విభజన వ్యవహారం తెలిసినా పదవుల కోసం నోరుమూసుకున్నారని అన్నారు. వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.