: సోనియా నియోజకవర్గంలో యూపీ సీఎం ఆకస్మిక పర్యటన
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సొంత నియోజకవర్గం రాయ్ బరేలీలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఈరోజు ఆకస్మికంగా పర్యటించారు. పర్యటన గురించి ముందుగా నియోజకవర్గంలోని రైన్ పూర్ గ్రామ స్థానిక అధికారులకు తెలియకపోవడంతో ఖిన్నులయ్యారు. సోనియా నియోజకవర్గంలోని వెనుకబడిన గ్రామాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాల్లో అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఈ పర్యటన చేపట్టినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో అధికారులతో పలు విషయాలపై అఖిలేశ్ సమీక్ష నిర్వహించారు. ఐఏఎస్ ఆఫీసర్ దుర్గాశక్తి నాగపాల్ సస్పెన్షన్ వ్యవహారంపై సోనియా స్పందిస్తూ కొన్నిరోజుల కిందట ప్రధానికి లేఖ రాశారు. దాంతో, కాంగ్రెసం పై సమాజ్ వాదీ కొన్ని వ్యాఖ్యలు చేసింది.ఈ క్రమంలో అఖిలేష్ రాయ్ బరేలిలో పర్యటించడం ద్వారా తమ ప్రభుత్వం సోనియా నియోజకవర్గంలో అభివృద్ధికి చేస్తున్న కృషిని తెలుపుతోందంటున్నారు.