: చిరు, కావూరి కనబడటంలేదని భీమవరంలో గోడపత్రికలు
కేంద్ర మంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావు, ఎంపీ కనుమూరి బాపిరాజు కనబడడంలేదంటూ పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో గోడపత్రికలు వెలిశాయి. రాష్ట్ర విభజన ప్రకటన నాటినుంచి వీరు కనబడకుండా దాక్కున్నారంటూ గోడ పత్రికలు అంటించారు. అటు 400 అడుగుల ఫ్లెక్సీతో సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించారు. మరోవైపు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సమ్మె నిర్వహించారు.