: ఆహార భద్రత బిల్లు కన్నా దేశ సరిహద్దు రక్షణే ప్రధానం: బీజేపీ
సరిహద్దులో ఐదుగురు భారత జవాన్లపై కాల్పుల ఘటనపై కేంద్ర ప్రభుత్వం చేసిన భిన్న ప్రకటనలు బీజేపీ విమర్శలకు కారణమవుతున్నాయి. దీనిపై రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండు చేసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అనంతరం ఆహార భద్రతా బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది. అయితే, ఆహార భద్రత బిల్లు కన్నా దేశ సరిహద్దు రక్షణే ప్రధానమని, దానిపైనే చర్చించాలని కోరింది. దీనిపై సభలో సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ.. రాజ్యసభలో మంత్రి చేసిన ప్రకటనతో తామెందుకు సంతృప్తి పడాలని ప్రశ్నించారు. ఆయనను లోక్ సభ కు కూడా పిలిపించి విస్పష్ట ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు.