: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎమ్మెల్యేల హోమం
సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతి మరింత పెరిగింది. సబ్బవరం కూడలిలో శాసనసభ్యులు కన్నబాబు, గాంధీ మోహన్, వంగా గీతల ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. జేఏన్టీయూ విద్యార్థులు మానవహారం, ర్యాలీలు చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేయాలంటూ కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటిని ఎన్జీవోలు ముట్టడించారు.