: 11న సీమాంధ్ర కాంగ్రెస్ నేతల హస్తిన పర్యటన
ఈ నెల 11 న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలంతా కలసి ఢిల్లీ వెళ్లనున్నట్టు శాసనమండలి విప్ పద్మరాజు తెలిపారు. ఆంటోనీ కమిటీని కలసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరనున్నట్టు ఆయన తెలిపారు. సమస్యలేవైనా సరే కమిటీకి చెప్పండి అని అధిష్ఠానం సూచించడంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టనున్నారు. కాగా, ఇతర పార్టీల నేతలు.. అది కాంగ్రెస్ పార్టీ కమిటీ అని దానికి చెప్పడం వల్ల ఒరిగేదేమీ ఉండదంటున్నారు. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని కేంద్రం వద్దకు పంపిందని అందువల్ల కేంద్రం ఏదైనా కమిటీ వేస్తే దానిముందు తమ అభిప్రాయాలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.