: సరిహద్దుల్లో రూ.175 కోట్ల హెరాయిన్ పట్టివేత
ఒకవైపు సరిహద్దుల్లో పాక్ దళాలు యథేచ్చగా కాల్పులు జరుపుతుంటే.. మరోవైపు పెద్ద ఎత్తున హెరాయిన్ పట్టుబడడం గమనార్హం. జమ్మూకాశ్మీర్లోని పాక్ సరిహద్దు గ్రామం గగోబువాలో నిన్న రాత్రి పోలీసులు 35 కిలోల హెరాయిన్ ను ఒక వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 175 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. ఈ వ్యవహారంలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు.