: బొత్సకు సమైక్య సెగ.... ఎన్జీవోలపై విరిగిన లాఠీ
విజయనగరంలో పీసీసీ అధ్యక్షడు బొత్స సత్యనారాయణ ఇంటిని ఎపీ ఎన్జీవోలు ముట్టడించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని అతని ఇంటి వైపుగా ఏపీఎన్జీవోలు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సమైక్యవాదులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు ఎపీఎన్జీవోలపై లాఠీ చార్జ్ చేశారు.