: పేషెంట్ పై కన్నేసిన దుష్ట వైద్యుడు


వైద్యో నారాయణౌ హరి.. అంటారు. డాక్టర్ దేవుడితో సమానమని ఆ వాక్య సారాంశం. కానీ ఈ దుష్ట వైద్యుడు ఓ బాలిక (17)పై కన్నేశాడు. వైద్యం కోసం వచ్చిన ఆమెను ఎలాగైనా అనుభవించాలని తలపోశాడు. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని జ్యోతి నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత బాలిక ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇంటికి సమీపంలోని ఓంప్రకాశ్ తాక్ అనే ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్ళింది. వైద్యం చేస్తానంటూ సదరు ఆర్ఎంపీ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. భయాందోళనలకు గురైన బాలిక పెద్దగా అరవడంతో ఆ దుష్టుడు అక్కడినుంచి పలాయనం చిత్తగించాడు. దీంతో, ఆ బాలిక కుటుంబ సభ్యులు కేసు దాఖలు చేశారు.

బాధిత బాలికకు ఆ కీచక వైద్యుడు ఇంతకుముందే తెలుసని, ఆమె అతడిని అంకుల్ అని పిలిచేదని ఏసీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. దగ్గు మందు కోసం వెళితే అఘాయిత్యానికి యత్నించాడని ఏసీపీ తెలిపారు. ఓంప్రకాశ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News