: పెళ్లికి ఒప్పుకోలేదని యువతిపై ముసలోడి యాసిడ్ దాడి
24 ఏళ్ల యువతి.. తండ్రిని కోల్పోయింది. దాన్ని అవకాశంగా తీసుకున్నాడు ఆమె తండ్రి స్నేహితుడు. ఇంకేముంది 'పెళ్లి చేసుకో అమ్మాయ్' అంటూ వెంటపడ్డాడు. 'ఛీ ఇదేం బుద్ధి, కూతురు వయసున్న నాతో నీకు పెళ్లేంటి?' అంటూ ఆ అమ్మాయి తిరస్కరించింది. కానీ 50 ఏళ్ల ఆ కామ కింకరుడికి జ్ఞానోదయం కాలేదు. యాసిడ్ బాటిల్ తీసుకుని దాడి చేశాడు. త్రుటిలో ఆ అమ్మాయి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్నోలోని మహానగర్ ఏరియాలో నిన్న ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. 50 ఏళ్ల విష్ణు నారాయణ్ శివపురి 24 ఏళ్ల యువతిపై యాసిడ్ చిమ్మగా ఆమె తప్పించుకుని బయటపడిందని తెలిపారు. శివపురి తన తండ్రి స్నేహితుడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.