: వైఎస్సార్సీపీకి గుడ్ బై చెప్పిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే
ఇచ్ఛాపురంలో 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర ముగింపు సభలో షర్మిల చేసిన వ్యాఖ్యల కలకలం తెలంగాణలో చల్లారలేదు. రాష్ట్రాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం విభజించారన్న షర్మిల వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత నేతలు రాజీనామా బాటపట్టారు. తాజాగా, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణపై వైఎస్సార్సీపీ మాట మార్చినందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు ఆయన చెప్పారు.