: పురుషులకూ రొమ్ము క్యాన్సర్‌ వస్తోంది


రొమ్ముక్యాన్సర్‌ వ్యాధి ఎక్కువగా మహిళల్లోనే కనిపిస్తుంటుంది. ఇది పురుషుల్లో అరుదుగా కనిపించే వ్యాధి. అయితే ఇటీవల కాలంలో ఈ వ్యాధి పురుషుల్లో కూడా తరచూ కనిపిస్తోంది. ఈ విషయాన్ని గమనించిన శాస్త్రవేత్తలు పురుషులు రొమ్ముక్యాన్సర్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

టెక్సాస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు పురుషుల్లో రొమ్ము క్యాన్సర్‌ వ్యాధి గురించి పరిశోధన సాగించారు. వీరి పరిశోధనలో గత పాతికేళ్ళతో పోలిస్తే ఇప్పుడు పురుషుల్లో రొమ్ము క్యాన్సర్‌ రావడం మరింతగా పెరిగిందని తేలింది. పాతికేళ్ల క్రితం ప్రతి లక్షమందిలో 0.86 శాతం మంది పురుషులు ఈ వ్యాధి బారిన పడుతుండగా ఇప్పుడు అది 1.08 శాతానికి పెరిగిందని చెబుతున్నారు. పురుషులు ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో రొమ్ము క్యాన్సర్‌ గుర్తించడం చాలా సులభమని, ఒక దశ దాటిన తర్వాత కూడా ఈ వ్యాధిని పురుషుల్లో సమర్ధవంతంగా నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యాధి బాధిత పురుషుల్లో 93.4 శాతంమందికి 'కార్సినోమా' ట్యూమర్‌ కారణంగానే ఈ వ్యాధి వచ్చినట్టు పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News