: సీమాంధ్ర ఉద్యమం ప్రజలదే.. కమిటీల వల్ల ఉపయోగం లేదు: ఎంపీ అనంత


సీమాంధ్రలో ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నారని ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. సమైక్య లక్ష్యానికి కేంద్ర మంత్రులకు పదవులు అడ్డంకి కారాదని అన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా సీమాంధ్ర మంత్రులు నడుచుకోవాలన్నారు. కమిటీలకు చెప్పుకోవడం వల్ల ఒరిగేదేమీ ఉండదని అనంత హెచ్చరించారు. పార్లమెంటులో తాము మరింతగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News