: మంత్రి శ్రీధర్ బాబుకు ఘనస్వాగతం
తెలంగాణ ప్రకటన అనంతరం ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలకు ఎక్కడికెళ్ళినా ఘనస్వాగతాలు లభిస్తున్నాయి. తాజాగా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు కరీంనగర్లో కార్యకర్తలు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతాయని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ప్రకటనపై కేంద్రం ఇక పునరాలోచించబోదని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ ప్రాంతానికే చెందుతుందని కేంద్రం చెప్పిన విషయాన్ని ఆయన మరోమారు గుర్తు చేశారు. ఇక తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించాలంటూ సీమాంధ్ర ప్రజలకు సూచించారు.