: రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ గరం
'దారిద్ర్యమన్నది ఓ మానసిక స్థితి మాత్రమే..'! ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో ఆధ్యాత్మిక గురువనుకుంటే పొరబడినట్టే. సాక్షాత్తు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఈ విధంగా ప్రవచించారు. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ వద్ద ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ, 'పేదరికమన్నది మనసుకు సంబంధించిన విషయం. అది ఆహారం, ధనం, ఇతర విషయాల కొరతతో ఏర్పడినది కాదు. స్వీయ విశ్వాసం పొందగలిగితే దారిద్ర్యాన్ని అధిగమించడం పెద్ద కష్టం కాబోదు' అని ఉద్బోధించారు.
రాహుల్ వ్యాఖ్యలపై యూపీ బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆయన మాటలు దురంహకార పూరితమని యూపీ బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదరికాన్ని అపహసించడమే రాహుల్ ఉద్దేశంగా కనిపిస్తోందని ఆరోపించారు. సంపన్నుల కుటుంబంలో పుట్టి కనీసం పేదరికాన్ని దరిదాపుల నుంచి కూడా చూడని గాంధీ నెహ్రూల వారసుడు ఈ విధంగా మాట్లాడడంలో ఆశ్చర్యమేమీలేదన్నారు.