: మీ డిమాండ్లు ఆంటోనీ కమిటీకి చెప్పుకోండి: రాయలసీమ నేతలతో సోనియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయాల్సిందేనని సోనియా గాంధీ రాయలసీమ నాయకులకు తెలిపినట్టు సమాచారం. ఢిల్లీలో గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలంటూ తనను కలిసిన రాయలసీమ ప్రజా ప్రతినిధులతో విభజన జరగాల్సిందేనని, తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని సోనియాగాంధీ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. మీ డిమాండ్లు ఏమున్నా ఆంటోనీ కమిటీకి చెప్పుకోండని అన్నట్టు తెలుస్తోంది. మేడం నిష్కర్షగా స్పందించడంతో రాయలసీమ నేతలు కంగుతిని, మేడంకి ధన్యవాదాలు చెప్పి వెనుదిరిగారని సమాచారం.