: టీడీపీ ఎంపీలపై చర్యలకు కమల్ నాథ్ పట్టు
రాజ్యసభలో సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించిన తెలుగుదేశం పార్టీ ఎంపీలపై చర్యలు తీసుకోవాలని మంత్రి కమల్ నాథ్ పట్టుబట్టారు. టీడీపీ సభ్యులపై 255 సెక్షన్ అనుసరించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కమల్ నాథ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ కు విజ్ఞప్తి చేశారు. అయితే, కమల్ నాథ్ ప్రతిపాదనకు డీఎంకే, అన్నా డీఎంకే సభ్యులు అభ్యంతరం చెప్పారు. టీడీపీ ఎంపీలపై చర్యలకు ఉపక్రమించదలచుకుంటే.. సీమాంధ్ర కేంద్ర మంత్రులపైనా, కాంగ్రెస్ ఎంపీలపైన కూడా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు.