: ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం: ఒమర్
పూంచ్ సెక్టార్ సమీపంలో ఐదుగురు భారత జవాన్లను పాక్ సైన్యం కాల్చి చంపడాన్ని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. భారత్ తో సంబంధాల పునురుద్ధరణకు పాక్ యత్నాలను ఇది ప్రశ్నార్థకం చేస్తుందన్నారు. ఇలాంటి చర్యలు పాకిస్థాన్ తో సంబంధాలు సాధారణ స్థితికి రావడానికి గానీ, మెరుగుపడడానికి గానీ తోడ్పడవని చెప్పారు. సైనికుల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఒమర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.