: సమైక్య నినాదాలతో రెండోరోజు పార్లమెంటు సమావేశాలు మొదలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండోరోజు కూడా సమైక్యాంధ్ర నినాదాలతో ప్రారంభమయ్యాయి. 'సమైక్యాంధ్ర వర్ధిల్లాలి' అంటూ సీమాంధ్ర ఎంపీలు నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. స్సీకర్ వారించినా ఎంతకీ వినకపోవడంతో సభను 12గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే తీరు కొనసాగుతోంది. జమ్మూకాశ్మీర్ లో పాక్ కాల్పులపై చర్చించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం సభ కొనసాగుతోంది.