: ఐఏఎస్ అధికారిణి సస్పెన్షన్ ఉపసంహరించుకోము: సమాజ్ వాదీ
ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ఇసుక మాపియా వ్యవహారంలో బలైన ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి నాగపాల్ సస్పెన్షన్ ను ఉపసంహరించుకునే ప్రసక్తేలేదని సమాజ్ వాదీ పార్టీ తేల్చి చెప్పింది. ఈ నిర్ణయంపై తన కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కట్టుబడి ఉన్నట్లు ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తెలిపారు. నిర్ణయం సరైందని, ఈ వ్యవహారంలో ఛార్జ్ షీటును వెనక్కి తీసుకోమన్నారు. తప్పుచేసిన వారికి శిక్ష పడుతుందన్న ములాయం ఇందుకు ఐఏఎస్ అధికారులు మినహాయింపు కాదన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ రెండు రోజుల కిందట యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాని మన్మోహన్ కు లేఖ రాశారు. దీంతో, ఎస్పీ, కాంగ్రెస్ మధ్య చిన్నపాటి ఘర్షణ మొదలైంది.