: టీడీపీ ఎంపీల తీరుతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల్లో కలవరం


పార్లమెంటులోని 63వ నంబరు గదిలో సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. ఈ భేటీకి అస్వస్థత కారణంగా మంత్రి కిషోర్ చంద్రదేవ్ హాజరు కాలేకపోయారు. కాగా, పార్లమెంటులో ప్రదర్శించిన వైఖరితో సీమాంధ్ర టీడీపీ ఎంపీల చిత్త శుద్ది ప్రజల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, దాన్ని అధిగమించడానికి ఏం చేయాలా? అని మంత్రులు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. కాగా, టీడీపీ సీమాంధ్ర ఎంపీలు సభను తమ నినాదాలతో హోరెత్తించి ఉభయసభలను అడ్డుకుని సమైక్యవాదాన్ని ఘనంగా వినిపించారు. వీరికి ఒకరిద్దరు కాంగ్రెస్ ఎంపీలు గొంతు కలిపినా, మేడమ్ భయం వదలకపోవడంపై సీమాంధ్రలో వ్యతిరేకత పెరుగుతోంది.

  • Loading...

More Telugu News