: ఎంఐఎం.. సీమాంధ్రలో బీజేపీపై దాడులు చేయిస్తోంది: కిషన్ రెడ్డి
ఎంఐఎం పార్టీ సీమాంధ్రలో బీజేపీ కార్యాలయాలపై దాడులు చేయిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాదులో ఆ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రలో ఉద్యమకారుల ముసుగులో తమ పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తోంది ఎంఐఎం మద్దతుదారులేనని ఆరోపించారు. సీమాంధ్ర ప్రజల సెంటిమెంటును తాము గౌరవిస్తామన్నారు. తెలంగాణ బిల్లు ఈ వర్షాకాల సమావేశాల్లోనే పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై పలువురు సమైక్యవాదులు విస్మయం చెందుతున్నారు. తెలంగాణ బిల్లు పెట్టమంటున్న కిషన్ రెడ్డి సీమాంధ్ర ప్రజల సెంటిమెంటును ఎలా గౌరవిస్తున్నట్టని మండిపడుతున్నారు.