: ప్రధానితో సచిన్ కరచాలనం.. గ్యాలరీలో డాక్టర్ అంజలి
భారత క్రికెట్ దేవుడు, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రధాని మన్మోహన్ సింగ్ వద్దకెళ్ళి మర్యాదపూర్వకంగా పలకరించారు. ఆయనతో కరచాలనం చేసి కుశల ప్రశ్నలు అడిగారు. అనంతరం తన సీట్లో ఆసీనుడై, పక్కనే కూర్చున్న సహచర రాజ్యసభ ఎంపీ, బాలీవుడ్ సుప్రసిద్ధ గీత రచయిత జావేద్ అక్తర్ తో ముచ్చటించాడు. ఓవైపు సభాకార్యక్రమాలు సాగుతుండగా సచిన్ అర్ధాంగి డాక్టర్ అంజలి గ్యాలరీలోంచి వీక్షించారు. దీంతో, టీవీ కెమెరాలు వీరిద్దరిపైనే పలుమార్లు ఫోకస్ చేశాయి.