: మీరు చేస్తున్నది న్యాయమా?: టీడీపీకి దేవినేని నెహ్రూ సూటి ప్రశ్న


దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) టీడీపీ వైఖరిపై మండి పడ్డారు. టీడీపీ అధినేత తీరువల్లే ఈరోజు రాష్ట్రంలో తీవ్రమైన సంక్షోభం నెలకొందని అన్నారు. పాదయాత్ర సందర్భంగా తెలంగాణలో వ్యతిరేకతను అడ్డుకునేందుకే టీఆర్ఎస్ తో కలిసి బాబు లాలూచీ పడ్డాడని ఆక్షేపించారు. సీడబ్ల్యూసీ నిర్ణయానికి ముందు, అఖిలపక్షం భేటీ సందర్బంగా టీడీపీ రాష్ట్ర విభజనకు మద్దతు పలికినందువల్లే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు నిర్ణయం తీసుకుందని అన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తరువాత తీరిగ్గా మేకప్ వేసుకుని వచ్చిన బాబు, రాజధాని నిర్మాణానికి 5 లక్షల కోట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. నేతల కుటిల రాజకీయాల కారణంగా ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయిందని తెలిపారు.

సీమాంధ్ర నేతల్లో ఐక్యతాభావం లేకపోవడం వల్లే రాష్ట్రానికి సంకటస్థితి సంభవించిందని, ప్రజలు చైతన్యంతో స్పందించి ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా నేతలు స్పందించి విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయాలని సూచించారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రజల ముందుకు వచ్చి తప్పు ఒప్పుకోవాలని దేవినేని డిమాండ్ చేశారు. సమైక్యతపై మీ వైఖరి సమ్మతమా? కాదా? అన్నది మీ విచక్షణకే వదిలేస్తున్నానని అన్నారు. మీరు చేస్తున్నది న్యాయమా? అని ప్రతి ఒక్క టీడీపీ నేత ప్రశ్నించుకోవాలని దేవినేని హితవు పలికారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులు ఒకే తాటిపై పని చేస్తే రాష్ట్ర విభజన జరగదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News