: మన చర్మాన్ని రక్షించే తేనె


తేనె తియ్యటి రుచితో అందరికీ ఇష్టమైనది. అనాదినుండి తేనెను పలు వైద్యాలకు ఉపయోగిస్తున్నారు. బరువు తగ్గేందుకు కూడా తేనెను సూచిస్తుంటారు. అయితే తేనెలో ఇన్ని సుగుణాలతోబాటు చర్మ సౌందర్యాన్ని రక్షించే గుణం కూడా వుంది. పలు సౌందర్య లేపనాల్లో తేనెను ఉపయోగిస్తుంటారు.

చర్మం చక్కటి నిగారింపునివ్వాలంటే తేనెను ఉపయోగించాలని పరిశోధకులు చెబుతున్నారు. మహిళలకు కాస్త సున్నితమైన చర్మం ఉంటుంది. వారి చర్మం చక్కగా మెరిసేందుకు తేనె, ఆలివ్‌ ఆయిల్‌, బ్రౌన్‌ షుగర్‌, నిమ్మరసం కలిపి ఫేస్‌ మాస్క్‌గా వేసుకుంటే దానివల్ల చర్మంపైని మృత కణాలు తొలగిపోయిన చర్మం చక్కగా మెరుస్తుందట. గాయాల కారణంగా ఏర్పడిన మచ్చలపై తేనెను రాయడం వల్ల గాయపు మచ్చలు తొలగిపోతాయి. ఎండ వేడిమి వల్ల చర్మం కమిలినపుడు ఆ భాగంపై తేనె పూయడం వల్ల కూడా ఉపశమనం పొందవచ్చు. ఈ విధంగా తేనెకు ఎన్నో ఔషధ విలువలున్నాయి.

  • Loading...

More Telugu News