: పోరాడకపోతే ప్రజలు ఉమ్మేస్తారు: ఉండవల్లి
రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఈ సాయంత్రం రాజమండ్రిలో 'జై ఆంధ్రప్రదేశ్' సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత తరుణంలో పార్టీలకతీతంగా పోరాడకపోతే ప్రజలు ముఖంపై ఉమ్మేస్తారని చెప్పారు. ఇకనైనా జెండాలు పక్కనబెట్టి నేతలు ఉద్యమంలో భాగస్వాములవ్వాలని ఉండవల్లి పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే అది ఉద్యమానికి ఊపునిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక, పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు పాసవ్వదని తాను నమ్ముతున్నట్టు చెప్పారు.