: ఏయూలో దీక్షలు భగ్నం
సమైక్యాంధ్ర కోసం విశాఖ ఏయూ విద్యార్థులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షలు భగ్నమయ్యాయి. గత ఆరు రోజులగా విద్యార్థులు మెతుకు కూడా ముట్టకుండా చేస్తున్న దీక్షలు పలువురు రాజకీయ నాయకులను కదిలించాయి. మంత్రి గంటా, ఎంపీ సుబ్బరామిరెడ్డి, ఎమ్మెల్యే వెలగపూడి తదితరులు ఈ విద్యార్థి నేతలను పరామర్శించి తమ మద్దతు తెలిపారు. అయితే, ఈ మధ్యాహ్నం విద్యార్థుల ఆరోగ్యం క్షీణిస్తుండడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఏడుగురు విద్యార్థి నేతలను ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఏయూలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.