: ఛత్తీస్ గఢ్ లో బర్డ్ ఫ్లూ అలర్ట్


మళ్లీ దేశంలో బర్డ్ ఫ్లూ ఘంటికలు మోగుతున్నాయి. ఛత్తీస్ గఢ్ వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక జారీ చేసింది. రాజన్ గాన్ జిల్లా అంజోరా గ్రామంలోని పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూని గుర్తించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి చంద్రశేఖర్ సాహు తెలిపారు. అంజోరా గ్రామంలో కొన్ని కోళ్లు చనిపోగా.. వాటిని పరీక్షల కోసం భోపాల్ పంపామని, ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా వైరస్ వల్ల మరణించినట్లు తేలిందని చంద్రశేఖర్ వెల్లడించారు. గ్రామం చుట్టూ 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని వైద్యాధికారులు పర్యవేక్షిస్తున్నారని, కిలోమీటరు వరకు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News