: జెట్ ఎయిర్ వేస్ వారం రోజుల డిస్కౌంట్ మేళా


ప్రైవేటు రంగంలో అగ్రగామి విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ వారం రోజుల పాటు తక్కువ ధరలకే ప్రయాణ టికెట్లను విక్రయిస్తోంది. ఈ నెల 9 వరకూ 7 లక్షల టికెట్లను ఇలా విక్రయించనున్నట్లు ప్రకటించింది. 750 కిలోమీటర్ల దూరం లోపు ప్రయాణ టికెట్ ధర 1,777 రూపాయలే. 750 నుంచి 1000 కిలోమీటర్ల ప్రయాణానికి చార్జీ 2,777 రూపాయలు. అలాగే 1000 కిలోమీటర్లకు మించిన ప్రయాణానికి 3,777 రూపాయలుగా నిర్ణయించింది. దీనికి అదనంగా కొన్ని పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ టికెట్ల రద్దునకు అవకాశం ఉండదు. ప్రయాణ తేదీ 10 లేదా ఆ తర్వాత తేదీలలో ఖరారు చేసుకోవాలి.

  • Loading...

More Telugu News