: ఎంపీకి ఎస్కేయూలో చేదు అనుభవం


సీమాంధ్రలో నేతలకు విభజన సెగలు కాసింత తీవ్రంగానే తాకుతున్నాయి. ఈ ఉదయం అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీలో దీక్ష చేపట్టిన విద్యార్థులను పరామర్శించేందుకు వెంకట్రామిరెడ్డి వెళ్ళారు. అయితే, విద్యార్థులు ఎంపీని చూడగానే.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేసి ఆయనను చుట్టుముట్టారు. సమైక్యాంధ్ర కోసం తాము అహోరాత్రాలు దీక్ష చేస్తుంటే, సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారంటూ విద్యార్థులు ఎంపీని నిలదీశారు.

  • Loading...

More Telugu News