: ఉద్యమ కార్యాచరణకు నేడు ఆంధ్రా ఉద్యోగ సంఘాల భేటీ
విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనే విషయమై చర్చించడానికి ఎపీఎన్జీవో ఉద్యోగ సంఘాల నేతలు ఈ రోజు విజయవాడలో సమావేశం అవుతున్నారు. దీనికి సీమాంధ్రలోని 13జిల్లాల ఉద్యోగ సంఘాల నేతలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరవుతారు. అలాగే 13 జిల్లాల రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు కూడా విడిగా భేటీ అయ్యి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోనున్నారు. ఈ రెండు సంఘాల నేతలు ఉమ్మడిగా భేటీ అయిన తర్వాత తమ కార్యాచరణను ప్రకటించనున్నారని సమాచారం. అవసరమైతే తెలంగాణలో జరిగినట్లుగా సకల జనుల సమ్మెను నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.