: గుర్తింపు సంక్షోభం ఉంటే డబ్బు యావ జాస్తి!
ఒంటరిగాళ్లు, ఏకాకులు.. తమలో ఉన్న గుర్తింపు సంక్షోభం ఎదుర్కొంటున్న వారు.. ప్రత్యామ్నాయంగా డబ్బు మీద మోజు పెంచుకుంచార్ట. గుర్తింపు సంక్షోభం ఉన్నవారే.. అతి ఎక్కువగా డబ్బుంటే.. ఆ గుర్తింపు వస్తుందనే భ్రమలో బతుకుతుంటారని ఓ అధ్యయనం చెబుతోంది. బాగా డబ్బు సంపాదించాలనే యావ వారిని నిలవనీయదు అని హాంగ్‌కాంగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో తేల్చారు. ఎవరూ తమ వెంట ఉండడం లేదన్న మధనంలో పడిపోయిన వారే డబ్బుకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారని చెప్పారు.
సమాజంలో గుర్తింపు అనేది డబ్బు ద్వారా వస్తుంది అనే అభిప్రాయంతో కొందరు ఉంటారని, అలాంటి వారు లాటరీలు, గుర్రప్పందేలు, పేకాటలు వంటి వాటి మీద దృష్టి పెడతారని అధ్యయనం చెబుతోంది. ఇలాంటి వక్రమార్గాల ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని వారు అనుకుంటారని.. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన రాడ్ డక్లోస్ చెబుతున్నారు.